సూర్యాపేట : మర్కజ్ మరక సూర్యాపేట జిల్లాను హడలెత్తిస్తోంది. మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తినుంచి ప్రైమరీ కాంటాక్ట్‌లు, సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా సోకింది. గురువారం ఒక్కరోజే జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 39 కరోనా పాజిటివ్ కేసులయ్యాయి. ఇందులో అత్యధికంగా సూర్యాపేట పట్టణంలోనే 28కేసులు ఉన్నాయి. కుడకుడ వ్యక్తినుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ షాప్ వ్యక్తికి, అతడినుంచి ఓ మహిళా కూరగాయల వ్యాపారికి, ఈమె నుంచి కొత్తగూడెం బజార్‌కు చెందిన మార్కెట్ బజార్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న కిరాణ, కూరగాయల వ్యాపారులకు ఈ వైరస్ సోకింది. మార్కెట్ బజార్‌లో 8మందికి వైరస్ సోకడంతో వీరినుంచి కుటుంబ సభ్యులకు అంటుకుంది. ఓ వ్యాపారికి చెందిన ఒకే కుటుంబలో ఆరుగురికి, మరో ఇద్దరు వ్యాపారుల కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురికి పాజిటివ్ తేలింది. మొత్తంగా సూర్యాపేట పట్టణంలోనే ఇప్పటివరకు 28మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా బారినపడిన ఆరేళ్ల బాలుడు