కరాచీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని దూకుడుతో ఓపెనింగ్ స్థానానికే వన్నె తెచ్చిన ఆటగాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు సెహ్వాగ్. టెస్టు క్రికెట్‌లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ మజాను అందించిన క్రికెటర్ సెహ్వాగ్. టెస్టుల్లో ఎన్నో సందర్భాల్లో హాఫ్ సెంచరీ, సెంచరీలను సిక్స్‌లతో ముగించిన సెహ్వాగ్. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫార్మాట్ ఓపెనింగ్ మైండ్‌సెట్‌ను మార్చేశాడనేది చాలామంది అభిప్రాయం. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ మైండ్‌సెట్‌ను మార్చింది సెహ్వాగ్ ఎంతమాత్రం కాదని అంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్. వీరేంద్ర సెహ్వాగ్ కంటే ముందే టెస్టు ఓపెనింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అని అక్రమ్ తెలిపాడు.
మా బ్యాట్స్‌మన్ తర్వాతే సెహ్వాగ్..